మా వూరికి ఒక 15km దూరం లో ఒక మాంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది.. అదేమిటంటే వరహా నది, శారదా నది సముద్రం లో కలిసే చోటు అన్నమాట.. భలే ఉంటుంది..
అదిగో.. ఆ కొండ కనిపిస్తుంది కదా.. ఆ కొండని ఆనుకొని "రేవు వాతాడ " అనే బుల్లి ఊరు ఉంది.. ఆ వూరికి రెండు వైపులా 2 నదులు , ... ఇంకోవైపు ఆ కొండా ఉంటై..ఆ పక్క సముద్రం..
కాస్త ముందుకెళ్ళాక.. ఈ రెండూ అలా కలిసి పోయి.. ఇదిగో... ఇలా సముద్రం లోకి కలిసి పోతాయి...
అదిగో.. ఆ కొండ కనిపిస్తుంది కదా.. ఆ కొండని ఆనుకొని "రేవు వాతాడ " అనే బుల్లి ఊరు ఉంది.. ఆ వూరికి రెండు వైపులా 2 నదులు , ... ఇంకోవైపు ఆ కొండా ఉంటై..ఆ పక్క సముద్రం..
ఆ ఊరికెళ్ళాలీ అంటే ఇదిగో.. ఇలాంటి పడవెక్కి
వెళ్ళాల్సిందే..
ఈ స్పాట్ సూపర్ అంతే.. రెండు కొండల మధ్యలో సాగర సంగమం.
ఇక్కడా సన్నగా పారుతున్నది చూసారు కదా..అదే వరహా నది..
ఇదేమో శారదా నది...
కాస్త ముందుకెళ్ళాక.. ఈ రెండూ అలా కలిసి పోయి.. ఇదిగో... ఇలా సముద్రం లోకి కలిసి పోతాయి...
ఇక్కడో గమ్మత్తైన సంగతి ఏమిటంటే.. పొద్దున్న ఆరు నుండి మధ్యానం రెండు వరకూ నదిలొఅ నీరు సముద్రం లోకి వెళుతుంది.. మధ్యానం మూడు నుండీ.. సముద్రం లోని నీరు నదిలోకి వస్తుంది... మేము పొద్దున్న వెళ్ళటం వల్ల ఇదంతా ఎండి పోయినట్టు కనిపిస్తుంది కానీ.. సాయంత్రం 6 దాటాక ఈ ప్రదేశం రూపు రేఖలే మారి పోతాయి.. మనం నడిచి వచ్చిన నేలంతా మునిగి పోతుంది.. ఎటుచూసినా నీరే ఉంటుంది..
కంటికి కనిపించినవి టక టకా నొక్కేశా ఇలా .. :)
నాదే నాదే.. ఈ ఫోన్ నాదే..