Monday, May 30, 2011

శిల్పారామం...

ఇదే..ఇదే ఎంట్రన్స్..


చూడగానే... వామ్మో.. ఇదేంటీ ఇక్కడా? అనుకున్నా.. ఒక్క క్షణం... 



సరిగ్గా.. ఈ కుమ్మరి సెట్ దగ్గర నా పక్కనే ఒక చిన్న పాపకి, నాన్నారికీ మధ్య జరిగిన సంభాషణ.

 "కుమ్మరి" అంటే ఎంటీ ?
కుమ్మరి అంటే పాట్స్ తయారు చేసేవాడు.
ఓ.. అయితే "కుమార్" అని కూడా వీళ్లనే అంటారా? కుమార్ = కుమ్మరి??
 





ఇంత పెద్ద కొండపల్లి బొమ్మని చూడటం ఇదే ఫస్ట్ టైం.. బావుంది కదూ..! 
మాయాబజార్


చీ..చీ.. ఏం జాతకం రా నీదీ? 


ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. చాలా నాచురల్ గా ఉంది కదూ?










చీ..చీ.. ఎక్కడికెళ్ళినా  ఈ కుక్కలు ఎవ్వర్నీ వదలవ్ కదా.. ;(
బ్లాక్ & వైట్ కాంబినేషన్ లో కొం(దొం)గ జపం

Saturday, March 19, 2011

శిలలపై శిల్పాలు చెక్కినారూ... మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారూ...


కర్నాటక లో హసన్ జిల్లా లోని "హళేబీడు... ".. శ్రీ కేదారీశ్వరుడు కొలువై ఉన్న పుణ్యస్థలం.
అద్భుతమైన శిల్పకళా సంపద కలిగిన ఆలయం.


ఇలా దూరం నుంచి చూస్తుంటే గోడలకి ఎవో డిజైన్స్ వేసినట్టు ఉంది కదూ.. దగ్గరకి వెళ్ళి చూస్తే అవన్నీ శిల్పాలే.. ఎవరు చెక్కారో, ఎంతమంది చెక్కారో, ఎన్నేళ్ళు చెక్కారో తెలీదు గానీ.. వహ్ వా.. ఆలయ ప్రాంగణం మొత్తం ఒక్క ఇంచ్ కూడా వదలకుండా ఔరా... అనిపించేలా ఉన్నై..



హర హర మహా దేవ శంభో శంకరా...

ఉగ్రనారసింహుడు


ఆ ఏనుగు ఉంది చూశారా..? నాకు భలే అనిపించింది నిజంగానే నడిచొస్తున్నట్టు లేదూ..?
యుద్ధం జరుగుతుంది ఇక్కడ.. గాల్లో వెలుతున్న బాణాలు చూడండి.. ఇలాంటివెన్నో.... రకరకాల నృత్యాలు చేస్తున్నట్టుగా.. యౌద్ధాలు చేస్తున్నట్టుగా.. అన్నీ చూడాలంటే ఒకరోజు సరిపోదేమో.. !
కైలాసాన్ని ఎత్తుతున్న రావణాసురుడు.
పార్వతీ పరమేశ్వరులు..

ఆదిపరాక్తి... 




హా.. ఇదిగో ఇదెమో "శ్రావణ బెలగొళ" లోని గోమటేస్వరాలయం. చూడ్డానికి కొండలాగా కనిపిస్తుందే.. అది నిజానికి కొండ కాదు.. బండ. మొత్తం రాయి నే. కొండమీదకి వెళ్ళలి అంటే అయితె మెట్లెక్కి వెళ్ళాలి. ఆ మెట్లు కూదా ఎలా ఉంటాయి అంటే ఆరాయినే మెట్ల లాగ చెక్కేశారన్న మాట. ఎక్కడన్న స్లిప్ అయ్యమంటే ముందు దైరెక్ట్ గా కిందకెళ్ళిపోయి ఆ తర్వాత డైరెక్ట్ గా పైకే.. :) 





కొండ మీద 18  మీటర్ల ఎత్తుగల "గోమటేస్వరుని " భారీ ఏకశిలా విగ్రహం.

 

Thursday, February 24, 2011

సాగరసంగమం

మా వూరికి ఒక 15km దూరం లో ఒక మాంచి బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది..  అదేమిటంటే  వరహా నది, శారదా నది  సముద్రం లో కలిసే చోటు అన్నమాట.. భలే ఉంటుంది.. 


అదిగో.. ఆ కొండ కనిపిస్తుంది కదా.. ఆ కొండని ఆనుకొని "రేవు వాతాడ " అనే బుల్లి ఊరు ఉంది.. ఆ వూరికి రెండు వైపులా  2  నదులు , ... ఇంకోవైపు ఆ  కొండా ఉంటై..ఆ  పక్క సముద్రం..



 ఆ ఊరికెళ్ళాలీ అంటే ఇదిగో.. ఇలాంటి  పడవెక్కి
 వెళ్ళాల్సిందే..



 ఈ స్పాట్ సూపర్ అంతే.. రెండు కొండల మధ్యలో సాగర సంగమం.

ఇక్కడా సన్నగా పారుతున్నది చూసారు కదా..అదే వరహా నది..

 ఇదేమో శారదా నది...


కాస్త ముందుకెళ్ళాక.. ఈ రెండూ అలా కలిసి పోయి.. ఇదిగో... ఇలా సముద్రం లోకి కలిసి పోతాయి...


ఇక్కడో గమ్మత్తైన సంగతి ఏమిటంటే..  పొద్దున్న ఆరు నుండి మధ్యానం రెండు వరకూ నదిలొఅ నీరు సముద్రం లోకి వెళుతుంది..   మధ్యానం మూడు నుండీ.. సముద్రం లోని నీరు నదిలోకి వస్తుంది...  మేము పొద్దున్న వెళ్ళటం వల్ల ఇదంతా ఎండి పోయినట్టు కనిపిస్తుంది కానీ.. సాయంత్రం 6 దాటాక ఈ ప్రదేశం రూపు రేఖలే మారి పోతాయి..  మనం నడిచి వచ్చిన నేలంతా మునిగి పోతుంది..  ఎటుచూసినా నీరే ఉంటుంది..    


కంటికి కనిపించినవి టక టకా నొక్కేశా ఇలా  .. :) 







నాదే నాదే.. ఈ ఫోన్ నాదే..