Wednesday, November 17, 2010

జీవని లో ఓ రోజు

ఎప్పటినుండో జీవని కి వెళ్ళాలి , వెళ్ళాలి  అనుకుంటున్న మా కోరిక మొన్నటి ఆదివారం తీరింది.. 14 /11 /2010 నా జీవితం లో మరిచి పోలేని రోజు. నాకు తెలియని ఒక కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టిన రోజు. గంటలు క్షణాల్లా గడిచి పోయిన రోజు. ఇదిగో...  పువ్వుల్లా నవ్వుతున్న ఈ పసి పిల్లలతో గడిపిన రోజు.



ఈ చిన్నారిని  చూసి అనుకున్నా.. తనకసలు మాటలొచ్చా ? అని . తనని కదిపితే చాలు పాటలూ, పద్యాలూ, అలా ఆగకుండా చెప్పేస్తూ ఉంటే.. విని తరించాల్సిందే.. ఏవేవో పాటలు పాడింది నాకు తెలిసినవీ , తెలియనివీ . నాకన్నీ అర్ధం కాలేదనుకోండి :) :)  కోకిల పాటకి సాహిత్యం అవసరం లేదు కదా అని విని ఆనందించా... 






ఈ ముగ్గురు అబ్బాయిలు చాలా కామ్మ్ లెండి. ఫోటో కి పోజ్ ఇవ్వమంటే .. ఇదిగో ఇలా స్టైల్ గా నించున్నారు..:)



ఈ బుడుగు పేరు కైఫ్ (మహ్మద్ కైఫ్?? ) . కానీ తను బౌలర్ అట.. :) :) "నీకెన్ని అంకెలోచ్చో చెప్పు" అని అడిగా (ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డాను లెండి). 1 నుండి మొదలెట్టి ఇంక ఆపలేదు మరి :) :) 



మరి కొందరు "స్టైలిష్ స్టార్స్" ఇలా పోజ్లు ఇచ్చారు..


ఈ కుర్రాడి పేరు శివ కుమార్. చాలా Talented లెండి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ ఇరగదీసేస్తాడు. తన  మిమిక్రీ , డాన్స్లులతో ఆదరగొడతాడు. :) :) ఆ స్టిల్ చూసారా,,,? :) :) 
  









ఈ అమ్మాయి లావణ్య. తను అమ్మాయిలందరికీ లీడర్ అన్నమాట.. :) 


ఈ చిట్టితల్లి ఎంత చలాకీనో తెలుసా..? అలా జింక పిల్లలా పరిగెడుతూనే ఉంది..




పిల్లలంతా సింగల్  గా కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోటో తీయించుకోడానికే ఇష్టపడ్డారు..  
ఇదిగో ఇలా..






ఒక విషయం చెప్పాలి. పిల్లలందరినీ పరిచయం చేసుకున్నాక, మేము  పార్క్ కి నడిచి వెళుతున్నాం. నాతో పాటు నడుస్తున్న ఒక చిన్నారి  వచ్చి, నా చెయ్యి పట్టుకొని  "మమ్మల్ని చూడటానికి వచ్చారు.. చాలా థాంక్స్ సార్" అంది. నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. నా నోట్లోనుండి మాట రాలేదు. గుండె భారమయి పోయింది. ఆ క్షణం లో  ఎవరైనా నన్ను మాట్లాడిస్తే డ్చేసేవాడినేమో..! (ఎందుకు? అని అడగకండి. నాకు కారణం సరిగా తెలీదు).
5 అంకెల జీతం తో ఉద్యోగం వచ్చినప్పుడో, ఊహించని రేంజ్ లో హైక్ వచ్చినప్పుడో, ఇండియా పాకిస్తాన్ మీద గెలిచినప్పుడో, సచిన్ వండేల్లో 200 కొట్టినప్పుడో కలిగిన చిన్నపాటి ఆనందం కాదది. మాటల్లో చెప్పలేని ఉద్వేగం... 

కానీ ఒకటి మాత్రం అర్ధమయ్యింది. మనం ధన రూపేణా చేసే సహాయం పరిపూర్ణం కాదు. మన సమయాన్ని వారి కోసం  వెచ్చించినప్పుడే అది పరిపూర్ణం అవుతుంది.
  
'జీవని స్వచ్చంద సంస్థ' కొందరు మంచి మనసున్న గొప్ప మనుషులు చేస్తున్న మహా యజ్ఞం. వారి సేవా ప్రపంచం లోకి నేను  అడుగుపెట్టినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.  

జీవని సంస్థవారు  తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, దానికి మన అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ.....