Monday, December 12, 2011

ప్రకృతి రమణీయత...!

పోయిన వారం ఆఫీస్ సంత తో కలిసి టూర్ వెళ్ళాను. కూర్గ్ అన్నమాట. అంతకు ముందు ఒక సారి వెళ్ళొచ్చాను గానీ ఈ సారి అడవి లో ట్రెక్కింగ్, తత్పలితం గా కాళ్ళుపీకులూ గట్రా స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నమాట.అబ్బబ్బా... దట్టమయిన మంచుతో... ఎంత అందం గా ఉన్నాదీ అంటే ఫోటోలు తియ్యాలన్న ఆలోచనే రాలేదంటే నమ్మండీ. అలా చూస్తూ ఉండిపోవచ్చు..!


క్రేజీ కాంబినేషన్.. 

 ఆ తర్వాత ట్రెక్కింగ్ అనీ, జలపాతం బాగుంటుందనీ... అంటేనూ.. అలా అడవి లో అన్నల్లాగా బ్యాగు భుజానేసుకొని, కెమెరా మెళ్ళో వేసుకొనీ నడిచాం.. నడిచాం.. కొండలెక్కుతున్నాం, దిగుతున్నాం. జలపాతం కాదుగానీ ముందు దేవుడు కనిపించాడు. ఒళ్ళంతా చమట్లు, కాళ్ళు నొప్పులూ, వెనక్కి పోదాం అన్నా వీల్లేదు... దాదాపు ఏడుపొచ్చేసినంత పనయ్యిందీ...
కానీ....
           కానీ............... ఫైనల్ గా.....


ఇలా జలపాతం కనిపించటం తో.. అలుపంతా మరిచిపోయీ, అరుపులూ కేకలతో కేరింతలు కొట్టాం.. మా బ్యాచ్ లో ఆడలేడీస్ లేకుండా ప్లాన్ చెయ్యటం తో.... ఒక లెక్క లో రెచ్చిపోయీ, నీట్లో దూకేసీ రచ్చ రచ్చ చేశాం. ఒక తాడు పట్టుకొనీ, అలా రాళ్ళ మీద ఎక్కేసీ జలపాతం పై వరకూ వెళ్ళి పోయి... ఓ హో నా రాజా.. ఆ చల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్ల్లని నీటిలో, ఫోర్స్ గా పడుతున్న ఆ వాటర్లో తానాలాడి పిచ్చి పిచ్చి గా ఎంజాయ్ చేశాం...!

కానీ అక్కడకి వెళ్ళేదారిలోనూ, ఆ నీటి దగ్గరా లెక్క లేనన్ని జలగలు... లక్కీ గా నన్ను పట్టుకోలేదు గానీ.. మా ఫ్రెండ్స్ కొంతమంది రక్తదానం బాగా చేశారు ;) ఒకడికయితే ఐదో ఆరో  పట్టేసుకొని పిండేశాయ్.. ;(


చెట్లు కాదండీ.. వరి పొలం 

 ఇదే నా టెంట్..


తిరిగొచ్చేటప్పుడూ కుషాల్ నగర్ అలా ఓ లుక్కేసి వచ్చేశామన్న మాట..ఈ ఫోటో తీసేటప్పుడూ శైలాబాల గారు గుర్తొచ్చేరు. వారికి ఈ ఫోటో అంకితః

21 comments:

 1. ఫోటోలూ..కబుర్లూ..రెండూ బావున్నాయ్.

  ReplyDelete
 2. ప్రకృతి రమణీయత చూసి నీలో...భావుకత్వం బాగా పరిమలిన్చినట్లుందే...!!!!!! :ద
  ఎంత బాగున్నాయో...కుటోలు,...నాకు కామెర ఇచ్చేయమంటే ఇయ్యవూఉ ... :(

  ReplyDelete
 3. yenta baagundi...abba jalapaatam ayite...superrrrrrrrr puto graphy...

  ReplyDelete
 4. అన్నీ బావున్నాయి.. కానీ మొదటి మూడూ బహు బావున్నాయి, రాజ్ :))

  ReplyDelete
 5. బాగున్నాయి ఫోటోలు .

  ReplyDelete
 6. నేను కుషాల్ నగర్ చూసాక కూర్గ్ వెళ్ళాను. 1 మరియు 2 చిత్రాలు అదిరినవి :)

  ReplyDelete
 7. జ్యోతిర్మయి గారూ ధన్యవాదాలండీ.

  కిరణ్.. ఏదో అలా అప్పుడప్పుడూ... కెమేరా ఇచ్చేస్తా..నా లక్ష నాకు కొట్టెయ్యి ;)

  శ్రావ్య గారూ, శశి గారూ ధ్యన్యవాదాలు.

  ReplyDelete
 8. నిషిగారూ థాంక్యూ వెరీ మచ్ అండీ. నాకు బాలయ్యబాబు డైలాగ్ గుర్తొస్తుందీ

  చైతన్యా ధాంక్యూ..!

  మురళి నువ్ కనక చూసినట్టయితే అవి నీకు తప్పకుండా నచ్చుతాయ్ అనుకున్నా.. ;) నాకూ బాగా నచ్చాయ్ అవీ.. థాంక్యూ

  ReplyDelete
 9. చాల బాగా ఫొటోస్ capture చేసావ్ రాజ్....నాకు చాల నచ్చాయి
  You are a good photographer

  ReplyDelete
 10. Very beautiful. మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
 11. ఫొటోలు చాలా బాగున్నాయి రాజ్! కూర్గ్ నేను చాలా సార్లు వెళ్ళాను. అక్కడికి దగ్గర్లో స్నేహితులూ, కూర్గ్ లో వాళ్ళకి గెస్టు హౌసూ ఉన్నాయి మరి!

  లక్ష్మణ తీర్థ (ఇరుపు) జలపాతం కాదనుకుంటా ఇది? అది చూశారా మీరు? దానిక్కూడా చాలా నడవాలి.కాఫీ తోటలూ, అల్లుకున్న మిరియాల ఆకుల తోరణాలు..మెలికలు తిరిగే రోడ్లూ, అసలు వెస్ట్రన్ ఘాట్స్ అంటేనే అందాలే అందాలు!

  ఈ మధ్య మేము సకలేష్ పూర్ నుంచి (హసన్ దగ్గర్లో) ధర్మస్థల వెళ్ళాం. అసలు ఆ రోడ్ ఎంత అందంగా ఉందంటే...కుడి వైపు అంతా కొండలమీది నుంచి జారే జలపాతాలు..ఎడమవపున అవన్నీ కలిపి ఏర్పడ్డ "కెంపొళి" అనే నది. చెప్పలేను. ఎవరికీ డైలాగుల్లేవు.

  ReplyDelete
 12. అన్నట్టు మేమూ కూర్గ్ నుంచి బెంగుళూరు తిరిగొస్తూ కుషాల్ నగర్ (బైలుకుప్పె), శ్రావణ బెళగొళ చూశాం!

  ReplyDelete
 13. సౌమ్యగారూ,మధురవాణి గారూ, ధన్యవాదాలండీ

  హరే థాంక్యూ....

  బద్రీ.. ఏమిటి నిజమే? ;) థాంక్యూ

  శేఖరూ.. ఏదో అలా కలిసొస్తాయి.. థాంక్యూ..

  ReplyDelete
 14. జయగారూ ధన్యవాదాలు.. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు

  ReplyDelete
 15. సుజాత గారూ.. మీ ఫ్రెండ్స్ కి గెసు హౌసులున్నాయా.. అయితే ఈ సారి మేము వెళ్ళేటప్పుడు మిమ్మల్నే అడుగుతా ;)

  ఇరుపు ఫాల్స్ చూశానండీ.. సూపర్ కదా... కానీ దానికన్నా ఎక్కువ నడక అండీ దీనికీ.. ;(
  యెస్.. కాఫీ తోటలు అవీ సూపర్ గా ఉంటాయ్.

  ధర్మస్థలి కి వెళ్ళే రూట్ ఇప్పుడు బాగుంది కానీ, నాలుగేళ్ల క్రితం నేను వెళ్ళినప్పుడు చాలా అద్వాన్న అండీ. ఆ రోజు గుడికి వెళుతూ అనుకూడదు గానీ
  ఎందుకు వస్తున్నాన్రా బాబూ అనుకున్నా.. పైగా ఘాటీ కదా మలుపులు అవీనూ. ఇప్పుడు బాగుంది.

  కుషాల్ నగర్ మీకు నచ్చుతుందాండీ? ;)
  శ్రావణ బెళగొళ ఈ సారన్నా కొండ ఎక్కారా? లేకా కిందనే ఉండి పోయారా? ;)

  ధన్యవాదాలండీ

  ReplyDelete
 16. superb...nice clicks..... especially second di chala bagundi....

  ReplyDelete