కర్నాటక లో హసన్ జిల్లా లోని "హళేబీడు... ".. శ్రీ కేదారీశ్వరుడు కొలువై ఉన్న పుణ్యస్థలం.
అద్భుతమైన శిల్పకళా సంపద కలిగిన ఆలయం.ఇలా దూరం నుంచి చూస్తుంటే గోడలకి ఎవో డిజైన్స్ వేసినట్టు ఉంది కదూ.. దగ్గరకి వెళ్ళి చూస్తే అవన్నీ శిల్పాలే.. ఎవరు చెక్కారో, ఎంతమంది చెక్కారో, ఎన్నేళ్ళు చెక్కారో తెలీదు గానీ.. వహ్ వా.. ఆలయ ప్రాంగణం మొత్తం ఒక్క ఇంచ్ కూడా వదలకుండా ఔరా... అనిపించేలా ఉన్నై..
హర హర మహా దేవ శంభో శంకరా...
ఉగ్రనారసింహుడు
ఆ ఏనుగు ఉంది చూశారా..? నాకు భలే అనిపించింది నిజంగానే నడిచొస్తున్నట్టు లేదూ..?
యుద్ధం జరుగుతుంది ఇక్కడ.. గాల్లో వెలుతున్న బాణాలు చూడండి.. ఇలాంటివెన్నో.... రకరకాల నృత్యాలు చేస్తున్నట్టుగా.. యౌద్ధాలు చేస్తున్నట్టుగా.. అన్నీ చూడాలంటే ఒకరోజు సరిపోదేమో.. !
కైలాసాన్ని ఎత్తుతున్న రావణాసురుడు.
పార్వతీ పరమేశ్వరులు..
ఆదిపరాశక్తి...
హా.. ఇదిగో ఇదెమో "శ్రావణ బెలగొళ" లోని గోమటేస్వరాలయం. చూడ్డానికి కొండలాగా కనిపిస్తుందే.. అది నిజానికి కొండ కాదు.. బండ. మొత్తం రాయి నే. కొండమీదకి వెళ్ళలి అంటే అయితె మెట్లెక్కి వెళ్ళాలి. ఆ మెట్లు కూదా ఎలా ఉంటాయి అంటే ఆరాయినే మెట్ల లాగ చెక్కేశారన్న మాట. ఎక్కడన్న స్లిప్ అయ్యమంటే ముందు దైరెక్ట్ గా కిందకెళ్ళిపోయి ఆ తర్వాత డైరెక్ట్ గా పైకే.. :)
కొండ మీద 18 మీటర్ల ఎత్తుగల "గోమటేస్వరుని " భారీ ఏకశిలా విగ్రహం.
చక్కటి చిత్రాలు. ఒకప్పుడు గుళ్ళూ గోపురాలు కట్టడం అనేది ఒక నాగరికపు ముచ్చట అయ్యుంటుంది. ఇంకా భక్తితో చూసి ఆనందించే వాళ్ళు ఉన్నారు కాబట్టి, మన అదృష్టం బాగుండి ఇంకా నిలిచి ఉన్నాయి.
ReplyDeletebaagunnai...
ReplyDeleteSuper, you must learn history of North East Korea now
ReplyDeleteentha bagunnayo..!! :)
ReplyDeleteWonderful Pics Venuram. Excellent:))
ReplyDeleteబేలూరు, హళేబీడు నా ఫేవరిట్ స్థలాలండీ! చాలా సార్లు వెళ్ళాను. మీరు తీసిన ఫొటోలు చూస్తుంటే ఆ ట్రిప్పులన్నీ గుర్తొస్తున్నాయి. ఇహ శ్రావణ బెళగొళ విషయానికొస్తే సగం మెట్లెక్కి, అవి మరీ స్టీప్ గా ఉండటంతో అటు పైకీ వెళ్ళలేక, ఇటు కిందకీ రాలేక కాసేపు తన్నుకుని చివరకి కిందకే వచ్చాను ఎలాగో పాక్కుంటూ! మా ఇంట్లో వాళ్ళంతా పైకి వెళ్ళి గోమఠేశ్వరుడిని చూసి మరీ వచ్చారు.
ReplyDeleteమళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదుగా, మీ ఫొటోలు అద్భుతంగా ఉన్నాయని
Rao S Lakkaraju గారు.. హ్మ్మ్... సరిగ్గా చెప్పారు. కానీ ఈ ఆలయాల విషయానికి వస్తే అంతగా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించలేదు. ఇప్పటికే చాల వరకూ పాడైపోయాయండి. :( :( ధన్యవాదాలు..
ReplyDeleteరాజేష్ గారు థాంక్స్ అండి.
Anonymous గారు చిత్తం. :) :)
కిరణ్ గారు థాంక్యు...
శ్రావ్యగారు , మనసుపలికేగారు ధన్యవాదాలండీ.
సుజాత గారు.. అవునాండీ..:) బేలూరు వెళ్దాం అనుకున్నా కానీ కుదర్లేదండి. :( :(
ReplyDeleteనిజమే శ్రావణబెలగొళ మెట్లు మాత్రం చాలా ప్రమాదకరమండీ. అయితే మీరు గోమటేస్వరున్ని చూడలేదన్న మాట.:(
మీ కామెంట్ చూశాక చాలా ఆనందమేసిందండి నాకు. ధన్యవాదాలు. :)
చాలా బాగున్నాయి ... :)
ReplyDeleteనాకైతే ఎల్లోరా గుర్తొచ్చింది ఒకసారి .. నేను మొట్ట మొదటిసారి చూసిన అతి పెద్ద శిల్ప కళా సంపద ...
నువ్వింకా ఇలా ఎన్నో ఎన్నెనో గుళ్ళు తిరిగి .. ఇంకా మంచి మంచి ఫొటోస్ తీయాలి అని ఆశీర్వదిస్తున్న .. :)
సూపర్ కేక కెవ్వ్ అంతే ..
Nice Pictures
ReplyDeletesir u shown the past history through the art "Photography" in a excellent way ,individual sculpture pics are excellent, Small request
if u have the dangerous steps at Sravan belogala's Pictures Please
Put
Rams(Siva Krishna)
ఓహ్ అద్భుతం...అయితే ఈసారి కర్నాటక కి ట్రిప్ వెయ్యాలి. యుద్ధం, కైలాసాన్ని ఎత్తుతున్న రావణుడు...నిజంగా అద్భుతం!
ReplyDeleteచెక్కిన శిల్పాలతో మీ చాయా చిత్రాలు పోటీపడ్డాయి...
ReplyDeleteహహహ..అవునా కావ్యగారు.. :) ధన్యవాదాలు మీ వ్యాఖ్యకీ, ఆశీర్వాదానికీ :)
ReplyDeleteరాంస్ గారు ధన్యవాదాలు.. ఫోటోస్ అప్లోడ్ చేశాను చూడండి.
సౌమ్యగారు.. నాకు కూడా నచ్చిందండి అదీ.. ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. నెనర్లు.
చిచ్చు గారు చాలా థాంక్స్ అండీ.
చాలా బావున్నాయి రాజ్..
ReplyDeleteExcellent!
ఫోటోలు చాలా బాగున్నాయి. అల్లాగే ఆ ప్రదేశాలు, చిత్రాల గురించి కూడా ఒక పోస్టు వేస్తే మాలాంటి వాళ్ళం చదివి, తెలుసుకొని ఆనందిస్తాము.
ReplyDeleteభలే ఉన్నాయండీ..నేనెప్పుడో ఏడో క్లాసులో ఉన్నప్పుడు స్కూల్ టూర్ లో చూసాను...ఫొటోలు సూపర్.
ReplyDeleteమీ (కెమేరా) పనితనం బావుంది. ఫోటోలు చాలా బావున్నాయి. మీరు ఎల్లోరా వెళ్ళినప్పుడు- అక్కడ కూడా రావణాసురుడు కైలాసం ఎత్తిన శిల్పం పెద్దదిగా ఉంటుంది,తప్పకుండా ఫోటో తియ్యండి. ఇంకా మీ చిత్రంలో బోల్డు చిత్రాలు చూపుతారని ఎదురుచూస్తున్నాం.
ReplyDeleteరాజ్ ఫోటొలు చాలా బావున్నయి. కానీ హలేబీడు శిల్పాలు క్లోజ్ షాట్స్ తీసి ఉంటే అవి పెట్టండి. ప్రపంచంలోనే minute carving అని ఒక ఇంగ్లీషోడు సర్టిఫై చేశాడు. మెడలో హారం వుంటే పూలరెమ్మలు వాటి మధ్య ఖాళీలు కూడా చెక్కారు. అవి చూస్తుంటే తల తిరుగుతుంది. రెండు తరాల పాటు హొయసాలులు వాటిని చెక్కారు. హలేబీడులో నల్లటి మెత్తటి రాతిని ఉపయోగించారు. బేలూరులో తెల్లటి గట్టి రాతిని వాడారు. ఏళ్ళ తరబడి యఙ్ఞంలా వాటిని నిర్మించివుంటారు. ఆ శిల్పులు ఎలా జీవించివుంటారు? వారి చీఫ్ అంత మందిని ఎలా సమన్వయం చేసి వుంటాడు? ఇవన్నీ తల్చుకుంటూ చూస్తే వాహ్ గొప్ప అనుభూతి.
ReplyDeleteహరే... థాంక్యు వెరీ మచ్.. :)
ReplyDeleteబులుసు సుబ్రహ్మణ్యం గారూ... నేను చూసిందీ తక్కువే, తెలుసుకున్నదీ తక్కువేనండీ..:) అయినా ఫోటో బ్లాగులో ఇదే ఎక్కువ అనీ ఊరుకున్నా.. :) :) ధన్యవాదాలండి.
ఎన్నెల గారూ..అవునా..? బాల్య స్మృతులన్నమాట. ధన్యవాదాలండీ..
సుధా గారు.. తప్పకుండానండీ.. కానీ ఎల్లోరా గురించి చదవటం వినడమే గానీ చూడలేదండీ. ధన్యవాదాలండీ.
అవును జీవని గారు.. సరిగ్గా చెప్పారు.. వాటీని చూస్తున్నంతసేపూ వహ్ వా అని అనుకోకుండా ఉండలేక పోయాను. క్లోజప్ షాట్స్ తీసుకోలేదండీ.. టైం సరిపోలేదు..ఈసారి ఒకరోజంతా హలేబీడు కి కేటాయించెయ్యాలి. :)
ReplyDelete>>రెండు తరాల పాటు హొయసాలులు వాటిని చెక్కారు.>> ఓహ్.. రెండు తరాల పాటా? ప్చ్....
ఆగుడి పూర్తి కాలేదనీ.. చాలా వరకూ ధ్వంసం చేశారనీ మాత్రం విన్నానండి.. ఇప్పుడున్న శిల్పాలు కూడా చాలా వరకూ పాడై పోయి ఉన్నాయి.ప్చ్...:(
నా దరిద్రం ఏమిటో తెలియదు కాని పోస్ట్ లు ఎప్పుడూ లేట్ గానే చూస్తా ......మంచి మంచి పోస్ట్ లు మిస్ అవుతూ ఉంటా ....."
ReplyDeleteశిలలపై శిల్పాలు చెక్కినారూ" రాజ్ కుమార్ గారు మీ బ్లాగ్ కి కొత్త అందం వచ్చింది ఈ ఫొటోస్ తో ...చాలా బాగున్నాయి ఫొటోస్ ....
మీ ఫోటో బ్లాగ్ చూస్తే ఓ చిన్న సలహా ఇవ్వాలి అనిపిస్తుంది ... ఏదయినా కాంపిటేషన్ లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా మీరు
చాలా బాగున్నాయి ! బెంగళూరు నుండి ఎంత సేపు పడుతుందండి ?
ReplyDeleteవంశీకృష్ణ గారు ధన్యవాదాలండీ..బస్ లో వెళితే సుమారు నాలుగు గంటలు పడుతుందండీ.ః)
ReplyDelete