Wednesday, November 17, 2010

జీవని లో ఓ రోజు

ఎప్పటినుండో జీవని కి వెళ్ళాలి , వెళ్ళాలి  అనుకుంటున్న మా కోరిక మొన్నటి ఆదివారం తీరింది.. 14 /11 /2010 నా జీవితం లో మరిచి పోలేని రోజు. నాకు తెలియని ఒక కొత్త ప్రపంచం లోకి అడుగు పెట్టిన రోజు. గంటలు క్షణాల్లా గడిచి పోయిన రోజు. ఇదిగో...  పువ్వుల్లా నవ్వుతున్న ఈ పసి పిల్లలతో గడిపిన రోజు.



ఈ చిన్నారిని  చూసి అనుకున్నా.. తనకసలు మాటలొచ్చా ? అని . తనని కదిపితే చాలు పాటలూ, పద్యాలూ, అలా ఆగకుండా చెప్పేస్తూ ఉంటే.. విని తరించాల్సిందే.. ఏవేవో పాటలు పాడింది నాకు తెలిసినవీ , తెలియనివీ . నాకన్నీ అర్ధం కాలేదనుకోండి :) :)  కోకిల పాటకి సాహిత్యం అవసరం లేదు కదా అని విని ఆనందించా... 






ఈ ముగ్గురు అబ్బాయిలు చాలా కామ్మ్ లెండి. ఫోటో కి పోజ్ ఇవ్వమంటే .. ఇదిగో ఇలా స్టైల్ గా నించున్నారు..:)



ఈ బుడుగు పేరు కైఫ్ (మహ్మద్ కైఫ్?? ) . కానీ తను బౌలర్ అట.. :) :) "నీకెన్ని అంకెలోచ్చో చెప్పు" అని అడిగా (ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డాను లెండి). 1 నుండి మొదలెట్టి ఇంక ఆపలేదు మరి :) :) 



మరి కొందరు "స్టైలిష్ స్టార్స్" ఇలా పోజ్లు ఇచ్చారు..


ఈ కుర్రాడి పేరు శివ కుమార్. చాలా Talented లెండి. తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ ఇరగదీసేస్తాడు. తన  మిమిక్రీ , డాన్స్లులతో ఆదరగొడతాడు. :) :) ఆ స్టిల్ చూసారా,,,? :) :) 
  









ఈ అమ్మాయి లావణ్య. తను అమ్మాయిలందరికీ లీడర్ అన్నమాట.. :) 


ఈ చిట్టితల్లి ఎంత చలాకీనో తెలుసా..? అలా జింక పిల్లలా పరిగెడుతూనే ఉంది..




పిల్లలంతా సింగల్  గా కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఫోటో తీయించుకోడానికే ఇష్టపడ్డారు..  
ఇదిగో ఇలా..






ఒక విషయం చెప్పాలి. పిల్లలందరినీ పరిచయం చేసుకున్నాక, మేము  పార్క్ కి నడిచి వెళుతున్నాం. నాతో పాటు నడుస్తున్న ఒక చిన్నారి  వచ్చి, నా చెయ్యి పట్టుకొని  "మమ్మల్ని చూడటానికి వచ్చారు.. చాలా థాంక్స్ సార్" అంది. నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. నా నోట్లోనుండి మాట రాలేదు. గుండె భారమయి పోయింది. ఆ క్షణం లో  ఎవరైనా నన్ను మాట్లాడిస్తే డ్చేసేవాడినేమో..! (ఎందుకు? అని అడగకండి. నాకు కారణం సరిగా తెలీదు).
5 అంకెల జీతం తో ఉద్యోగం వచ్చినప్పుడో, ఊహించని రేంజ్ లో హైక్ వచ్చినప్పుడో, ఇండియా పాకిస్తాన్ మీద గెలిచినప్పుడో, సచిన్ వండేల్లో 200 కొట్టినప్పుడో కలిగిన చిన్నపాటి ఆనందం కాదది. మాటల్లో చెప్పలేని ఉద్వేగం... 

కానీ ఒకటి మాత్రం అర్ధమయ్యింది. మనం ధన రూపేణా చేసే సహాయం పరిపూర్ణం కాదు. మన సమయాన్ని వారి కోసం  వెచ్చించినప్పుడే అది పరిపూర్ణం అవుతుంది.
  
'జీవని స్వచ్చంద సంస్థ' కొందరు మంచి మనసున్న గొప్ప మనుషులు చేస్తున్న మహా యజ్ఞం. వారి సేవా ప్రపంచం లోకి నేను  అడుగుపెట్టినందుకు ఎంతో ఆనందిస్తున్నాను.  

జీవని సంస్థవారు  తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని, దానికి మన అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ.....



37 comments:

  1. >>ఆ క్షణం లో ఎవరైనా నన్ను మాట్లాడిస్తే ఏడ్చేసేవాడినేమో

    మా పరిస్థితి కూడా అలానే అయ్యింది.. ఏం జవాబు చెప్పాలో అసలు అర్థం కాలేదు.. అసలు టాపిక్ ఎలా డైవర్ట్ చెయ్యాలో కూడా పాలుపోలేదు.. మరి వాళ్ళకు ఎలా చెప్పమని ఎవరైనా చెప్పారా, లేక వాళ్ళకై వాళ్ళే అలా చెప్పారా అనేది కనుక్కోవాలి..
    పిల్లలందరూ నాకంటే చలాకీగా ఉన్నారు.. వాళ్ళ భవిష్యత్తు నేను తప్పకుండా బాసటగా నిలబడతా..

    మరొకమాట మర్చిపోయావు:
    జీవినిలో జరుగుతున్నదంతా ప్రసాద్ గారి కృషి అనేది నిర్వివాదాంశం.. మనలాంటి వాళ్ళు ఎంతోమంది బయట నుంచీ సహకారం అందిస్తున్నా అక్కడ ఉండి పని చేయడం వేరు.. అలా పని చేస్తున్న ప్రసాద్ గారి గురించి ఎంత రాసినా తక్కువే..
    -కార్తీక్

    ReplyDelete
  2. మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారు బాబు అవుతారు

    ReplyDelete
  3. రాజ్, వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు నాది కూడా అలాంటి పరిస్థితే.
    ధనలక్ష్మి, లావణ్య, శివ సూపరు.

    ReplyDelete
  4. chala santhosham.
    thanks ila share chesinaduku. naku kuda eppatnuncho visit cheyalani, vallatho matladalani undi

    ReplyDelete
  5. పిల్లలతో గడిపితే కలిగే సంతోషం గురించి ఎంత చెప్పిన తక్కువే. చాలా రోజుల తరవాత మళ్లీ వాళ్ళ దగ్గరకు వెళ్ళినా గుర్తు పట్టి అన్నయ్య అని పిలిచినప్పుడు వాళ్ళ మోహంలో సంతోషం చూసి నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.

    ReplyDelete
  6. హ్మ్మ్.. అవును కార్తీక్ గారు, ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే..!
    "వాళ్ళకు ఎలా చెప్పమని ఎవరైనా చెప్పారా, లేక వాళ్ళకై వాళ్ళే అలా చెప్పారా".. ఉన్న పిల్లల్లో వాళ్ళే కదా పెద్ద వాళ్ళు. వాళ్ళకే అనిపించి ఉండొచ్చు..

    తార గారూ.. :) :)

    "ధనలక్ష్మి, లావణ్య, శివ సూపరు".. మరే.. ఆ మొదటి ఫోటో లోని పాప కూడా..:)

    స్వప్న గారు..! ఒకసారి వెళ్లి రండి మరి..:)

    ReplyDelete
  7. వావ్ మీ అనుభూతి ని చక్క గా మాతో పంచుకున్నారు .
    నా చెయ్యి పట్టుకొని "మమ్మల్ని చూడటానికి వచ్చారు.. చాలా థాంక్స్ సార్" అంది.
    -----------------------------------
    ఇది చదువుతుంటే ఒక్కసారి ఎలాగో అనిపిస్తుంది ఇక అక్కడ ఉన్న మీ పరిస్తితి అర్ధం చేసుకోగలను .
    పైన కార్తీక్ గారు చెప్పినట్లు అక్కడ ఉండి పని చేయటం అనేది నిజం గా జీవని ప్రసాద్ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే !

    I really appreciate you guys for spending your time with the children especially on the special occasion childrens' day.

    ReplyDelete
  8. రాజ్ కుమార్ గారూ జీవని పిల్లల గురించి మీ సహృదయతకు ధన్యవాదాలు. అలాగే స్పందించిన అందరికీ. జీవని అందరిదీ క్రెడిట్స్ కూడా అందరివీ. దయచేసి నా పేరు ప్రస్తావించకండి. పిల్లలకు దాతలకు అనుసంధానకర్తను మాత్రమే. నాకు ఈ అవకాశం ఇస్తున్న మీ అందరికీ మరియు పిల్లలకు నేను రుణపడి ఉంటాను. నేను పని చేస్తున్నా జీవని గురించి నాతో పాటు తపన పడుతున్నవారు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి నేను అన్న పదానికి జీవనిలో చోటు లేదు. మీ బిజీ జీవితాల్లో ఒక రోజు కేటాయించి శ్రమకోర్చి ఇక్కడికొచ్చినందుకు, నైతికంగా ఆర్థికంగా మీరు ఇస్తున్న మద్దతుకు......

    @ తార
    మీ మాట తప్పక నెరవేస్తారు బాబూ తప్పక నె..ర..వే..( మాటలు రావడంలేదు, గొంతు పూడుకుపోతోంది )

    ReplyDelete
  9. నేను కూడలి లో ఫొటోలు చూస్తూ..ఎవరబ్బా ఈ చిన్నపిల్లల్లు అనుకున్నా! తీరా మీ బ్లాగలోకి వచ్చాక నాకు అర్ధమయింది.అంతకుముందు ఎక్కడో చదివాను...బెంగళురు నించి ఎవరో ముగ్గురు తెలుగు బ్లాగర్లు అనంతపురంలో ఉన్న ఈ సంస్థకి వస్తున్నారు అని. ఇప్పుడు ఆ పిల్లలందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది :)

    >>ఒక విషయం చెప్పాలి. పిల్లలందరినీ పరిచయం చేసుకున్నాక, మేము పార్క్ కి నడిచి వెళుతున్నాం. నాతో పాటు నడుస్తున్న ఒక చిన్నారి వచ్చి, నా చెయ్యి పట్టుకొని "మమ్మల్ని చూడటానికి వచ్చారు.. చాలా థాంక్స్ సార్" అంది. నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. నా నోట్లోనుండి మాట రాలేదు. గుండె భారమయి పోయింది. ఆ క్షణం లో ఎవరైనా నన్ను మాట్లాడిస్తే ఏడ్చేసేవాడినేమో..! (ఎందుకు? అని అడగకండి. నాకు కారణం సరిగా తెలీదు).

    ఈ లైన్స్ చాల హృద్యంగా ఉన్నాయి.మీరు చేసిన ఈ పని వారికి ఎంత ఆనందం కలిగించిందో ఆ ముఖాలు చూస్తుంటనె అర్ధమవుతోంది.నేను మిమ్మల్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా!

    ReplyDelete
  10. పిల్లలందరూ చక్కగా ఉన్నారు. వాళ్ళ మొహాల్లో ఆనందం, నవ్వులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
    జీవని గురించి వారి బ్లాగు లో చదివాను. మీ పోస్ట్ చూశాక అక్కడికి వెళ్ళకుండా ఉండలేను :) టైమ్ కుదురితే త్వరలో వెళ్ళాలనే ఆశ.

    ReplyDelete
  11. వేణూ గారు నేను రాసిన కామెంట్ ఎగిరిపోయిందా ? లేక
    మీరే విడుదల చేయలెదా?

    ..
    పిల్లల మొహాల్లో నవ్వులు ఆనందం చక్కగా వున్నారు అందరు.చాలా సంతోషం.

    ReplyDelete
  12. @సాయి.. హమ్మ్.. అదే కదా..!
    శ్రావ్య గారు చాలా థాంక్స్ అండి..
    , ఇందు గారూ.. ధన్యవాదాలు..వాళ్ళ కన్నా మేమే ఎక్కువ ఆనందించాం అనుకుంటా... :)
    రమ్య గారు.. . "వాళ్ళ మొహాల్లో ఆనందం, నవ్వులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది."
    వాళ్ళు అలాగే నవ్వుతూ మాకు వీడ్కోలు చెప్పి పంపించారు... నాకు మాత్రం "మళ్లీ రండి త్వరలో.." అని ఆహ్వానించినట్టు అనిపించింది..

    అజ్ఞాత గారూ .. ధన్యవాదాలు..

    ReplyDelete
  13. sweet kids. keep up the good work :)

    ReplyDelete
  14. వేణురాం.. నీలో ఈరోజు ఒక కొత్త వేణురాంని చూస్తున్నాను. నీ టపా చూసి నా గుండె కూడా భారమయ్యింది.. జీవనికి వెళ్లిన మీ అందర్నీ కూడా ఎలా అభినందించాలో తెలియడం లేదు. ఆ చిన్నారులని చూస్తూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ నన్ను అల్లుకుంది.. చాలా చాలా నచ్చింది నీ టపా ఇంకా మీరు చేసిన ఈ గొప్ప పని..:)) ముఖ్యంగా జీవని ప్రసాద్ గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.. కార్తీక్ గారు అన్నట్లు, ప్రసాద్ గారి గురించి ఎంత రాసినా తక్కువేనేమో..

    ReplyDelete
  15. excellent!
    మొదటి ఫొటోలో ఉన్న చిట్టితల్లి, పొట్టి బుడంకాయ కైఫ్ సూపరు.
    మిగతా పిల్లలంతా కూడా ఎంతో చలాకీగా, ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు.
    వారు అలా ఉండడానికి కృషి చేస్తున్న జీవని కి ముఖ్యంగా ప్రసాద్ గారికి వేల వేల నమస్కారములు, అభినందనలు.

    ReplyDelete
  16. >>ఆ క్షణం లో ఎవరైనా నన్ను మాట్లాడిస్తే ఏడ్చేసేవాడినేమో<<<<<<<

    ఈ టపా చదువుతు ......... నన్ను కూడా ఏడిపించేసారు వేణురాం గారు ......

    మీ మంచి మనసే ఆ పిల్లల మొహాల్లో అనందం,నవ్వులు గా కనిపిస్తుందేమో ..

    ఇంత మంచి పనికి ఎలా అభినందించాలో నాకేమి తెలియడంలేదు వేణురాం గారు ....ఎందుకంటే ఎలా అబినందించినా తక్కువేగా ..

    నేను చాలా proud గా ఫీల్ అవుతున్నా ...ఎందుకంటే???? ఆ పిల్లలకి చెప్పాలి... ఇంత మంచి సార్ మా ఫ్రెండ్ తెలుసా అని

    జీవని గారు మీకు నా నమస్కారములు,మీ కృషి నిర్వచించలేనిది సార్ ........

    ReplyDelete
  17. శివరంజని గారూ.."ఆ పిల్లల మొహాల్లో అనందం,నవ్వులు గా కనిపిస్తుందేమో .." అదంతా ప్రసాద్ గారు, వారికి సప్పొర్ట్ చేస్తున్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు , మరియు జీవని టీం ల కృషి ఫలితం. ఇందులో మేము చేసింది ఏమీ లేదు. (మొదటి సారి సారీ చెప్పకుండా కామెంట్ పెట్టారు సంతోషం.:) )

    @మనసు పలికే.. అవును నేనిప్పుడు సరికొత్త వేణూరాం ని. పూర్తిగా మారి పోయాను. :) :) thnQ.. :)

    సౌమ్య గారూ,లలిత గారు,రాణి గారు ధన్యవాదాలు.

    ReplyDelete
  18. క్రిందా చేపలు తీసేయి చిరాగ్గా, అవి బొమ్మే ఐనా వచ్చిన ప్రతిసారి మేత వెయ్యకుండా వెళ్ళిపోలేక, మళ్ళీ అవి బొమ్మే కదా అనీ మేత వేసిన ఆనందం లేకుండా సిరాగ్గా ఉన్నది.

    -

    Taara.

    ReplyDelete
  19. అవి బొమ్మలు కాకపొతే వలేసి పట్టుకొని , వండుకు తినేద్దురా ?? :) :) అయినా అంత కిందకి ఎవరెళ్ళమన్నారు మిమ్మల్ని ?

    ReplyDelete
  20. Very touching!
    I really appreciate you guys!
    పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు. :)

    ReplyDelete
  21. మధురవాణి gaaru.. ThnQ very much.. :)

    ReplyDelete
  22. Mee Photos Chuste Naa kuda
    Hudrayam Adola Iypoyidi
    Great Photographs ,Great Help..
    Life in Photographs

    Rams@picsoframs.blogpsot.com

    ReplyDelete
  23. excellent....అభినందనలు

    ReplyDelete
  24. రామ్ గారు, ధన్యవాదములు...మీ బ్లాగ్ నాకు ఓపెన్ కావటం లేదు.. ఎందుచేతనో మరి?
    భాను గారు ధన్యవాదాలండి...

    ReplyDelete
  25. వేణు ఈ పోస్ట్ వేసినపుడు మా తోడికోడలు నేను చాలా సంతోషించాం ఆ పిల్లల పొటోస్ వాళ్ళ కబుర్లు విని...మీరందరూ చేసిన పనికి చాలా సంతోషించాం ..కాని కామెంట్ పెట్టడం మర్చిపోయా
    ఈ రోజు మా అబ్బాయికి చూపిస్తే వాళ్ళందరి తో సాకర్ టీం పెట్టుకుంటాడంట..ఒక్కో అబ్బాయి గురించి వాళ్ళ క్రింద నువ్వు రాసిన కామెంట్ నా చేత చదివి వినిపించుకుని నవ్వాడు..
    విషయానికొస్తే చాలా మంచి పని చేసావ్ రాజ్...ఇంతకు మించి చెప్పలేను..అన్నిటికన్నా ప్రసాద్ గారికి అభినందనలు

    ReplyDelete
  26. santhosham ga vundi jivani gurinchi chaduvuthoo vunte.

    ReplyDelete
  27. నేస్తం అక్కా.. ధన్యవాదాలు.. :)
    " ఈ రోజు మా అబ్బాయికి చూపిస్తే వాళ్ళందరి తో సాకర్ టీం పెట్టుకుంటాడంట..ఒక్కో అబ్బాయి గురించి వాళ్ళ క్రింద నువ్వు రాసిన కామెంట్ నా చేత చదివి వినిపించుకుని నవ్వాడు.."
    హా హా చాలా ఆనందం గా ఉంది నాకు.. :)ఒక క్రికెట్ టీం కూడా :) :)

    అజ్ఞాత గారు థాంక్స్ అండి..

    ReplyDelete
  28. విజయ్ గారు..

    Jeevani Voluntary Organization,
    28/4/271, Vijayanagar Colony,
    Anantapur,
    Andhra Pradesh, India.

    Email : jeevani.sv@gmail.com

    Mobile : (+91) 99482-71023

    http://jeevani2009.blogspot.com/2008/12/blog-post.html

    ReplyDelete
  29. వేణూరాం చాలా బాగున్నాయండి ఫోటోలు.. మీభావాలను వ్యక్తీకరించిన తీరు కూడా చాలా బాగుంది. ఇంతమంచి పని చేసిన మీకు, కార్తీక్, ఇంకా మీతోవచ్చిన ఇతరులకు కూడా జేజేలు.. Keep up the good work.

    ReplyDelete
  30. వేణుగారు..! ధన్యవాదాలు..

    ReplyDelete
  31. jeevani prasaad gaari blog peru yentandee.?

    ReplyDelete
  32. ennela gaaru..

    http://jeevani2009.blogspot.com/2008/12/blog-post.html

    ReplyDelete
  33. Thanks Venu garu..blog choostaanu tappakunda....

    ReplyDelete