Sunday, August 21, 2011

ఏటికొప్పాక హస్తకళా వైభవం - 3.

మీకు తెలుసా? ప్రపంచం లోనే అతిచిన్న వుడెన్ చెస్ బోర్డ్ చేసినందుకు గానూ ఇద్దరు భారతీయుల పేర్లు గిన్నిస్ రికార్డ్స్ లో పొందుపరచబడినవంటా. అందులో ఒకరయిన మళ్ళ శివ గారు మన రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుండి అంటా. వీరు 8mm x 8mm కొలతలతో చెక్కతో చెస్ బోర్డ్ తయారు చేశారు.


అయితే దాన్ని స్పూర్తిగా తీసుకున్నఏటికొప్పాక చిన్నయాచారి గారు 1.2mm x 1.2mm కొలతలతో అతి చిన్ని చెస్ బోర్డ్ తయారు చేశారు (హ్యాండ్ మేడ్) . పోయిన సారి నేను వారిని కలిసినప్పుడు చూడమని నా చేతికి  ఒక గాజు పెట్టెని ఇచ్చారు. 


అందులో ఏం చూడాలో తెలియక తెల్లమొహమేసిన నన్ను, పైభాగం లో  అమర్చిన లెన్స్ ద్వారా చూడమన్నారు. నిజం గా అదొక అద్భుత కళాఖండం. చూస్తారా మరీ?? (ఈ ఐటెం కి ఫోటోలు తియ్యడానికి నా టాలెంటూ, నా కెమెరా టాలెంటూ సరిపోలేదు. భూతద్దాలు వాడవలసి వచ్చింది).





చేతివేళ్ల మధ్య ఎలా ఉందో చూడండీ...!







దీని లోని పీసెస్ కోసం బ్రహ్మజెముడు ముళ్ళనీ, బోర్డ్ కోసం తాటి చెట్టు పేళ్ళ నీ, ఆకృతి ని తీసుకురాడానికి సీడీ ప్లేయర్ లో ఉపయోగించే బుల్లి మోటార్ నీ, చూడటానికి మైక్రోస్కోప్ లోని లెన్స్ లని ఉపయోగించారట. 



దీన్ని గిన్నీస్ రికార్డ్ కోసం పంపించారు. కానీ ప్రస్తుతం ఇలా మైక్రోలెవెల్లో చేసిన అతి చిన్ని వస్తువుల క్యాటగిరీ ని తొలగించిన కారణంగా రెజెక్ట్ చేశారు. ప్చ్...ఒక తెలుగోడి పేరును  చేర్చుకునే అదృష్టం గిన్నిస్ బుక్ కి లేదనుకుందామా?? :-)
"ఈ చెస్ బోర్డ్ ని రికార్ఢుల్లో చేర్చి ఉంటే 0.5 mm విడ్త్ తో చేద్దామనుకున్నాను రాజ్"  అని ఆయన చెప్పినప్పుడూ ఎన్నో తెలివితేటలున్నా, చదవాలని కోరిక ఉన్నా, పేదరికం వల్ల తొమ్మిదవ తరగతి లోనే చదువు మానేయవలసి వచ్చీ, బ్రతుకు తెరువు కోసం కులవృత్తిని చేపట్టిన ఆయన లోని కళాకారుడికీ, కృషికీ, తపన కీ, సృజనకీ, హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేక పోయాను.

తన ఆకలిని చల్లార్చడానికి తన రెగ్యులర్ వర్క్ ఉందీ., కానీ 
తనలోని కళాకారుని ఆకలిని చల్లార్చీ తనకి మెప్పునీ, తన ఊరికీ, మన రాష్ట్రానికీ గుర్తింపునీ ఇచ్చేవి ఇలాంటి మాస్టర్ పీస్ లే కదా. వీటివల్ల ఆర్ధికంగా ప్రయోజనం లేకపోయినా మనమిచ్చే చిన్న ప్రశంసా, ప్రోత్సాహం వారికి ఎంతో తృప్తినిస్తాయి. 

[చిన్నాగారి కాంటాక్ట్ డీటెయిల్స్.
schinnayachari@gmail.com
09959512198 ]

22 comments:

  1. అబ్బ..కెక...యెంత గొప్పవాళ్ళూ తెలుగు వాళ్ళు
    మద్యలొ నీ కన్నెమిటి బాబు...పె..ద్ద్...

    ReplyDelete
  2. ఏటి కొప్పాక బొమ్మలు చాలా బాగుంటాయి నాకు చాలా ఇష్టం. ఎన్నో ఉన్నాయి నా దగ్గర వాళ్ళు చేనేత కళల్లో సిద్ధహస్తులని మరో సారి మీ ఈ చిత్రాలు రుజువు చేసాయి. ధన్యవాదములు.

    ReplyDelete
  3. అద్భుతం.
    @it is sasi world let us share
    అది వేణూ కన్ను కాదు ఆ కంటిపాపలో కనిపిస్తున్నాడు చూడండి ఆయనే వేణూరాం :)

    ReplyDelete
  4. శశిగారూ.. ఆ కన్ను నాది కాదండీ. చిన్నా గారిది.
    ధన్యవాదాలు.

    రసజ్ఞ గారూ ధన్యవాదాలండీ.

    హరే,శ్రావ్య గారూ, ధన్యవాదాలు.

    విజయ్ గారు.. హహహ. ఈ మాట ఎవరంటారా అని చూశాను. ;) ;) థాంక్యూ అండీ..

    ReplyDelete
  5. Wow.. wow. wow.... Amazing art work!
    Thanks for sharing Raj! :)

    ReplyDelete
  6. wow...మతిపోతోంది రాజ్ చూస్తుంటే. చిన్నయాచారిగారు మామూలు మనిషి కాదు. ఎంతటి కళాపిపాస....ఇలాంటివాళ్ళు కారణ జన్ములు! ఆయనకి నమోనమః

    ReplyDelete
  7. అద్భుతం అంతే ఇంకో మాటలేదు రాజ్.

    ReplyDelete
  8. కెవ్వు రాజ్. అద్భుతం. చిన్నయాచారిగారికి జేజేలు. తొక్కల్లో గిన్నీస్ బుక్కు. అందులో రికార్డ్ చెయ్యనంత మాత్రాన అద్భుతాలు అద్భుతాలు కావా? ఇలాంటి మీనియేచర్స్ తయారు చేసి ఒక ప్రదర్శన ఏర్పాటు చెయ్యమను రాజ్. అప్పుడు జనాలే చెబుతారు వాటి గొప్పతనమేంటో.

    ReplyDelete
  9. "ఈ చెస్ బోర్డ్ ని రికార్ఢుల్లో చేర్చి ఉంటే 0.5 mm విడ్త్ తో చేద్దామనుకున్నాను"

    ఇదీ కళాకారుడి దాహమంటే. తొక్కలో గిన్నిస్ బుక్ అందులో ఎక్కితే ఎంత? ఎక్కక పోతే ఎంత. చూడగానే కళ్ళు పెద్దవయి, నోట్లోంచి మనకి తెలియకుండానే పలికే "అద్భుతం" అన్న పదం ముందు ఈ గిన్నిస్ లు గట్రా బలాదూర్. చిన్నయాచారి గారికి హేట్సాఫ్ . ఇంతటి గొప్ప కళాకారుడిని మాకు పరిచయం చేసినందుకు మీకు థాంకులో థాంకులు.

    ReplyDelete
  10. అద్భుతంగా ఉంది రాజ్. మాకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. రికార్డ్ తిరస్కరింఛడానికి కారణాలు స్పష్టంగా అర్ధం కావడంలేదు. కానీ వాళ్ళు గుర్తించనంతమాత్రాన అధ్బుతం అద్భుతం కాకుండా పోదు కదా... తన నైపుణ్యం అద్భుతంగా ఉంది..

    ReplyDelete
  11. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు

    ReplyDelete
  12. గొప్ప కళని ప్రదర్శించారు.
    భారతరత్న కాని గాంధీలా, రిలేటివిటీ థియరీకి రాని నోబుల్ బహుమానంలా... గిన్నీస్ బుక్‌ను తప్పు పట్టి వూరడిల్లే ప్రయత్నం కూడదు.

    ReplyDelete
  13. wowwwww...అసలు మాటల్లేవ్....:)
    సూపరంతే :)

    ReplyDelete
  14. THERE IS NO LUCK FOR GUINNESE RECORDS bOOK, wOW wHAT A FANTASTIC HAND WORK WHICH IS MIND BLOWING

    SATYA

    ReplyDelete
  15. naaa comment publish kaaledu..enduko!

    ReplyDelete
  16. naaa comment publish kaaledu..enduko!

    ReplyDelete
  17. రాజ్ కుమార్ గారు... మీ సృజనాత్మకత నన్ను అబ్బుర పరచింది...
    మీరు ఓ చెస్ బోర్డ్ ని ఎలా తయరు చెయ్యలో,ఎలా చూపించాలో అలానే చూపించారు...
    ఇక దాని సైజు పైన నాలాంటి వాళ్లకు అనుమానం రాకుండా ఓ మంచి... స్టఫ్...

    ReplyDelete