కర్నాటక లో హసన్ జిల్లా లోని "హళేబీడు... ".. శ్రీ కేదారీశ్వరుడు కొలువై ఉన్న పుణ్యస్థలం.
అద్భుతమైన శిల్పకళా సంపద కలిగిన ఆలయం.ఇలా దూరం నుంచి చూస్తుంటే గోడలకి ఎవో డిజైన్స్ వేసినట్టు ఉంది కదూ.. దగ్గరకి వెళ్ళి చూస్తే అవన్నీ శిల్పాలే.. ఎవరు చెక్కారో, ఎంతమంది చెక్కారో, ఎన్నేళ్ళు చెక్కారో తెలీదు గానీ.. వహ్ వా.. ఆలయ ప్రాంగణం మొత్తం ఒక్క ఇంచ్ కూడా వదలకుండా ఔరా... అనిపించేలా ఉన్నై..
హర హర మహా దేవ శంభో శంకరా...
ఉగ్రనారసింహుడు
ఆ ఏనుగు ఉంది చూశారా..? నాకు భలే అనిపించింది నిజంగానే నడిచొస్తున్నట్టు లేదూ..?
యుద్ధం జరుగుతుంది ఇక్కడ.. గాల్లో వెలుతున్న బాణాలు చూడండి.. ఇలాంటివెన్నో.... రకరకాల నృత్యాలు చేస్తున్నట్టుగా.. యౌద్ధాలు చేస్తున్నట్టుగా.. అన్నీ చూడాలంటే ఒకరోజు సరిపోదేమో.. !
కైలాసాన్ని ఎత్తుతున్న రావణాసురుడు.
పార్వతీ పరమేశ్వరులు..
ఆదిపరాశక్తి...
హా.. ఇదిగో ఇదెమో "శ్రావణ బెలగొళ" లోని గోమటేస్వరాలయం. చూడ్డానికి కొండలాగా కనిపిస్తుందే.. అది నిజానికి కొండ కాదు.. బండ. మొత్తం రాయి నే. కొండమీదకి వెళ్ళలి అంటే అయితె మెట్లెక్కి వెళ్ళాలి. ఆ మెట్లు కూదా ఎలా ఉంటాయి అంటే ఆరాయినే మెట్ల లాగ చెక్కేశారన్న మాట. ఎక్కడన్న స్లిప్ అయ్యమంటే ముందు దైరెక్ట్ గా కిందకెళ్ళిపోయి ఆ తర్వాత డైరెక్ట్ గా పైకే.. :)
కొండ మీద 18 మీటర్ల ఎత్తుగల "గోమటేస్వరుని " భారీ ఏకశిలా విగ్రహం.