Sunday, August 21, 2011

ఏటికొప్పాక హస్తకళా వైభవం - 3.

మీకు తెలుసా? ప్రపంచం లోనే అతిచిన్న వుడెన్ చెస్ బోర్డ్ చేసినందుకు గానూ ఇద్దరు భారతీయుల పేర్లు గిన్నిస్ రికార్డ్స్ లో పొందుపరచబడినవంటా. అందులో ఒకరయిన మళ్ళ శివ గారు మన రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి నుండి అంటా. వీరు 8mm x 8mm కొలతలతో చెక్కతో చెస్ బోర్డ్ తయారు చేశారు.


అయితే దాన్ని స్పూర్తిగా తీసుకున్నఏటికొప్పాక చిన్నయాచారి గారు 1.2mm x 1.2mm కొలతలతో అతి చిన్ని చెస్ బోర్డ్ తయారు చేశారు (హ్యాండ్ మేడ్) . పోయిన సారి నేను వారిని కలిసినప్పుడు చూడమని నా చేతికి  ఒక గాజు పెట్టెని ఇచ్చారు. 


అందులో ఏం చూడాలో తెలియక తెల్లమొహమేసిన నన్ను, పైభాగం లో  అమర్చిన లెన్స్ ద్వారా చూడమన్నారు. నిజం గా అదొక అద్భుత కళాఖండం. చూస్తారా మరీ?? (ఈ ఐటెం కి ఫోటోలు తియ్యడానికి నా టాలెంటూ, నా కెమెరా టాలెంటూ సరిపోలేదు. భూతద్దాలు వాడవలసి వచ్చింది).





చేతివేళ్ల మధ్య ఎలా ఉందో చూడండీ...!







దీని లోని పీసెస్ కోసం బ్రహ్మజెముడు ముళ్ళనీ, బోర్డ్ కోసం తాటి చెట్టు పేళ్ళ నీ, ఆకృతి ని తీసుకురాడానికి సీడీ ప్లేయర్ లో ఉపయోగించే బుల్లి మోటార్ నీ, చూడటానికి మైక్రోస్కోప్ లోని లెన్స్ లని ఉపయోగించారట. 



దీన్ని గిన్నీస్ రికార్డ్ కోసం పంపించారు. కానీ ప్రస్తుతం ఇలా మైక్రోలెవెల్లో చేసిన అతి చిన్ని వస్తువుల క్యాటగిరీ ని తొలగించిన కారణంగా రెజెక్ట్ చేశారు. ప్చ్...ఒక తెలుగోడి పేరును  చేర్చుకునే అదృష్టం గిన్నిస్ బుక్ కి లేదనుకుందామా?? :-)
"ఈ చెస్ బోర్డ్ ని రికార్ఢుల్లో చేర్చి ఉంటే 0.5 mm విడ్త్ తో చేద్దామనుకున్నాను రాజ్"  అని ఆయన చెప్పినప్పుడూ ఎన్నో తెలివితేటలున్నా, చదవాలని కోరిక ఉన్నా, పేదరికం వల్ల తొమ్మిదవ తరగతి లోనే చదువు మానేయవలసి వచ్చీ, బ్రతుకు తెరువు కోసం కులవృత్తిని చేపట్టిన ఆయన లోని కళాకారుడికీ, కృషికీ, తపన కీ, సృజనకీ, హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేక పోయాను.

తన ఆకలిని చల్లార్చడానికి తన రెగ్యులర్ వర్క్ ఉందీ., కానీ 
తనలోని కళాకారుని ఆకలిని చల్లార్చీ తనకి మెప్పునీ, తన ఊరికీ, మన రాష్ట్రానికీ గుర్తింపునీ ఇచ్చేవి ఇలాంటి మాస్టర్ పీస్ లే కదా. వీటివల్ల ఆర్ధికంగా ప్రయోజనం లేకపోయినా మనమిచ్చే చిన్న ప్రశంసా, ప్రోత్సాహం వారికి ఎంతో తృప్తినిస్తాయి. 

[చిన్నాగారి కాంటాక్ట్ డీటెయిల్స్.
schinnayachari@gmail.com
09959512198 ]

Sunday, August 7, 2011

ఏటికొప్పాక హస్తకళా వైభవం - 2

ఏటికొప్పాక బొమ్మల గురించి గతం లో ఒకదానిలో ఒకటి అమరే బొమ్మల గురించి చెప్పాను కదా...

ఇదే కాన్సెప్ట్ ని మరింత ముందుకు తీసుకెళ్ళీ  ఔరా.. అనిపించేలా అధ్బుతమయిన కళాఖండాన్ని చేసీ జాతీయ అవార్డ్ పొందీ తెలుగు వాడి సత్తానూ, సృజనాత్మకత నూ చూపించారూ.. లక్కబొమ్మల కళాకారుడూ
శ్రీ చిన్నయాచారి గారు.

అంకుడు కఱని దాదాపు కాగితం మందాన కోడి గుడ్డు ఆకారం లో మలచీ, ఒకదానిలో ఒకటి పట్టేటట్టు గా ఒకటి కాదు రెండు కాదు 51 గుడ్డులను తయారు చేసీ వాటిని ఒక "కోడీ గుడ్డు" లో పెట్టేశారు.  పెద్ద గుడ్డు పరిమాణం 41.5 mm  అయితే అతి చిన్న గుడ్డు పరిమాణం   0.17mm. నిజం గా అధ్బుతమ్ కదూ??















త్వరలోనే మరిన్ని గొప్ప కళాఖండాలని తయారు చేసీ, తనలాంటి మరెందరో నైపుణ్యం గల కళాకారులకి స్పూర్తి నిస్తూ, అంతర్జాతీయ స్థాయి లో మనదేశానికి ఖ్యాతి ని తీసుకురావాలని కోరుకుంటూ.... చిన్నయాచారి గారికి అభినందనలతో..